చెస్ గేమ్ ఎలా ఆడాలి!
- P. Goutham Sai
- Feb 8, 2016
- 4 min read
చెస్ గేమ్ లో వుండే కారెక్టర్స్:-
1) రాజు(King).

2) మంత్రి(Queen).

౩) శకటం(Bishop).

4) గుర్రం(Knight).

5) ఏనుగు(Rook).

6) బంటు(Pawn).

గోల్ అఫ్ చెస్.
ఇద్దరి అపోనేన్ట్స్ 64 స్క్వేర్స వుండే ఒక బోర్డు లో ఆడే ఆటే చెస్ అనగా చదరంగం. అన్ని గొప్ప దేశాల్లో ఇది పాపులర్ అండ్ పురాతన ఆట చెప్పబడుతుంది.
నియమాలు

చదరంగం అరవైనాలుగు గళ్ళు కలిగిన ఒక చదరపు బల్ల మీద ఆడతారు. ఈ అరవైనాలుగు గళ్ళలో నలుపు తెలుపు గళ్ళు ఒక దాని తర్వాత ఒకటి గా వస్తాయి, అంటే ఒక తెలుపు గడి పక్కన ఒక నలుపు గడి, ఆ తర్వాత తెలుపు గడి, అలా.... పావులు రెండు వర్గాలు గా విభజించబడి ఉంటాయి. ఒకటి నలుపు, ఇంకోటి తెలుపు. ఆటగాళ్లు తాము ఆడే పావుల రంగు బట్టి గుర్తించ బడతారు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు చెరో పదహారు పావులతో ఆట మొదలు పెడతారు. ఆ పదహారు పావులు ఇవే - ఒక రాజు, ఒక రాణి (మంత్రి అనికూడా వాడుక లో ఉంది), రెండు ఏనుగులు, రెండు గుర్రాలు, రెండు శకటాలు, మరియు ఎనిమిది సిపాయి పావులు.
ఎవరు తెల్ల పావులని తీసుకోవాలి ఎవరు నల్ల పావులని అనే విషయన్ని స్నెహపూర్వక ఒప్పందం ద్వారా కాని, రూపాయి బిళ్ళను పైకెగరేసి కాని నిర్థారించవచ్చు.
చెస్ బల్లని అమర్చడం
ఆటగాడి కుడి చేతి వైపు క్రింద తెల్ల గడి ఉండేట్టుగా బోర్డుని పెట్టాలి. ఆట ప్రారంభంలో మొదటి రెండు అడ్డ వరసలలో పావులను అమరుస్తారు. రెండవ వరసలో ఎనిమిది బంట్లు అమర్చి, మొదటి వరసలో మూల గళ్ళలో ఏనుగులు, వాటి పక్క గుర్రాలు, వాటి పక్క శకట్లు అమర్చాలి. ఇప్పుడు మిగిలిన రెండు మధ్య గళ్ళలో రాజు, మంత్రి అమర్చాలి. అయితే నల్ల మంత్రి నల్ల గడిలో, తెల్ల మంత్రి తెల్ల గడిలో పెట్టాలి.
పీసెస్ జరిపే విధానం.
మొదట ఎత్తు వేసే హక్కు తెల్లపావులది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎత్తులు వేసుకుంటూ పోతారు. ఒక ఎత్తులో ఒక పావుని మాత్రమే కదల్చాలి, ఒక్క కోట కట్టడం(castling)లోతప్ప. పావుని వాటి వాటి నియమల ప్రకారం ఏదేని ఖాళీ గడికి కాని, ఎదుటి పావులని చంపి ఆ పావులున్న గడికి కాని కదల్చవచ్చు. చంపిన పావులు ఆట నుండి బయటకు తీసివేయబడతాయి. exception: అయితే (en passant) (ఎన్ పాసంట్)లో మాత్రం బంటు చచ్చిన బంటూన్న గడికి పైగడిలొకి వెల్తుంది.
ఎవరి రాజైనా దాడిలో ఉంటే (అంటే తర్వాతి ఎత్తులో రాజును చంపగలిగే సామర్ధ్యం ఎదుటి పావుల్లో దేనికి ఉన్నా) రాజుకి షరా(Check )అన్న మాట. తన రాజు షరాలోకి వచ్చే ఏ ఎత్తు ఆటగాడు వెయ్యలేడు. ఎదుటి ఆటగాడు తన రాజు కి ఎదైనా పావుతో షరా చెపితే, 1)రాజుని షరా నుంచి తప్పించగలిగే ఎత్తు కాని, 2)రాజుకి, షరా ఛెప్పిన పావుకీ మధ్య వేరే పావు వచ్చే ఎత్తు కాని, లేదా 3)షరా చెప్పిన పావుని తీసి వేసే ఎత్తు కాని వెయ్యాలి. అటువంటి ఎత్తు లేకపోతే ఆటకట్టు(checkmate) అయినట్లే, అంటే ఆట ఓడిపోయినట్లే.
ప్రతి పావు ఎత్తుకి నియమాలు ఉన్నాయి,
రాజు: అడ్డంగా కాని, నిలువుగా కాని, మూలగా కాని ఒక్క గడి కదలొచ్చు. రాజుకి ఆట మొత్తంలో ఒక్కసారి కోట కట్టే (castling) అవకాశం ఉంటుంది .కోట కట్టడమంటే రాజుని ఏనుగు వైపు రెండు గళ్ళు కదిల్చి ఏనుగుని రాజు పక్క గడిలో పెట్టడం. కింద ఇచ్చిన అన్ని నియమములు (conditions) సరి అయితేనే రాజుకి కోట కట్టే అర్హత ఉంటుంది.
రాజు కాని కోట కట్టే ఏనుగు కాని కోట కట్టే ముందు ఎప్పుడూ కదిలి ఉండకూడదు.
రాజు కి ఏనుగు కి మధ్య ఏ పావులు ఉండకూడదు.
రాజు అప్పటి ఎత్తులో షరా లో ఉండకూదడదు, మరియూ కొట కట్టేందుకు ఉపయోగించే ఏ గడి శత్రు పావుల దాడికి లోనై ఉండకూడదు.
రాజు, ఏనుగు ఒకే ఎత్తులో ఉండాలి (పదోన్నతి పొందిన భటుడిని మినహాయించటం కోసం).
ఏనుగు: అడ్డంగా కానీ, నిలువుగా కానీ ఎన్ని గళ్ళు అయినా కదలవచ్చు. కదిలే గడికి, ప్రస్తుతమున్న గడికి మధ్య అన్నీ ఖాళీ గళ్ళు అయి ఉండాలి. (కోట కట్టడంలో కూడా ఏనుగు కదులుతుంది);
శకటు: మూలగా ఎన్ని గళ్ళు అయినా కదలవచ్చు. కదిలే గడికి ప్రస్తుతమ్మున్న గడికి మధ్య అన్నీ ఖాళీ గళ్ళు అయి ఉండాలి. అయితే శకటు ఎప్పుడూ గడీ రంగు మార్చదు గమనించండి. అండుకని నల్లగడి శకటు, తెల్ల గడి శకటు అనడం పరిపాటి.
మంత్రి అడ్డంగా కానీ, నిలువుగా కానీ, మూలగా కానీ ఎన్ని గళ్ళు అయినా కదలవచ్చు. కదిలే గడికి ప్రస్తుతమ్మున్న గడికి మధ్య అన్నీ ఖాళీ గళ్ళు అయి ఉండాలి.
గుర్రం వేరె పావుల మీంచి దూకగలదు. ఉన్న గడి నుంచి రెండు గళ్ళు అడ్డంగా ఒక గడి నిలువుగా లేక రెండు గళ్ళు నిలువుగా ఒక గడి అడ్డంగా కదిలి ఇంగ్లీష్ అక్షరం "L" లాగా కదుల్తుంది. చదరంగపు బోర్డు మధ్య ఉన్న గుర్రం ఎనిమిది గళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి సారీ గుర్రం కదిలినప్పుడు గడి రంగు మారుస్తుంది, అంటే నల్ల రంగు గడిలో ఉన్న గుర్రం కదిలితే తెల్ల రంగు గడిలోకి మాత్రమే వెళ్తుంది.
బంటు కదలికకు చాలా నియమాలు ఉన్నాయి:
బంటు ఎప్పుడైనా ఒక గడి(ఖాలీగా ఉంటే) ముందుకు వెళ్ళగలదు, పుట్టు గది లో మాత్రం ఒక గడి కానీ రెండు గళ్ళు కానీ(ఖాలీగా ఉంటే) ముందుకు వెల్ల గలదు. బంటు వెనక్కు కదలలేదు.
బంటు కదలిక మరియూ చంపడం వేరుగా ఉంటాయి, బంటు ఉన్న గడికి ఇరువైపులా మూలగా ఉన్న గళ్ళలో ఉన్న పావులను చంపగలదు. కానీ ఈ గళ్ళు ఖాళీగా ఉంటే బంటు మూలగా ఉన్న గడిని ఆక్రమించలేదు.
బంటు పుట్టు గదిలో రెండూ గళ్ళూ కదిలి శత్రువు బంటు పక్కనున్న అడ్డ గడిలో పెడితే, ఈ బంటు ఒకే గడి కదిలినట్టుగా భావించి శత్రు బంటు తినొచ్చు(చంపొచ్చు)"en passant" , కానీ ఇది బంటు కదిలిన వెంటనే వేసిన ఎత్తు అయి ఉండాలి.
బంటు కదలికా చంపడం రెండు వేర్వేరు విధాలుగా ఉంటుంది. కదలడం ముందుకు అయితే, చంపేటప్పుడు ముందు వైపు మూలగా ఉన్న రెండు గళ్ళలో ఉన్న ఎదైనా పావుని చంపగలదు. కానీ ఈ గళ్ళు ఖాళీగా ఉంటే మాత్రం అ గడికి కదలలేవు.
బంటు అలా ముందుకు పోయి శత్రు సైన్యం వైపు చిట్ట చివరి గడికి వెలితే అది ఆటగాడు ఎంచుకున్న దానీ బట్టి మంత్రిగా కానీ, ఏనుగు కానీ, శకటు కానీ, గుర్రంకానీ అవుతుంది.
గుర్రం తప్ప మరే పావు వెరొక పావును దాటి పోలేదు. దారిలో ఉన్న సొంత పావులను వెరే ఏ పావు దాటి పోలేదు మరియు replace చెయ్యలేదు. దారిలో ఉన్న శత్రు పావులను దాటలేము కాని చంపి ఆ గడిని ఆక్రమించుకోవచ్చు. చనిపోయున పావు బోర్డునుండి తీసివేయబడుతుంది. రాజుని చంపలేము. షరా (check)మాత్రమే పెట్టగలము. శత్రు రాజు షరా నుండి తప్పుకోలేకపోతే మనం ఆట గెలిచినట్టే.ఒక చదరంగపు ఆట యొక్క ఫలితం గెలుపు లేదా ఓటమి మాత్రమే అయి ఉండనక్కరలేదు. draw (tie) కూడా అయి ఉండొచ్చు. సాధారణంగా క్రింది సందర్భాలలో ఆట డ్రా గా ప్రకటించబడుతుంది: 1)తన వంతు వచ్చినప్పుడు ఆటగాడికి ఏ కదలికలూ లేనప్పుడు కానీ, 2)ఆటగాళ్ళిద్దరి పరస్పరాంగీకారంతో కానీ 3)వరుసగా మూడు కదలికలకూ ఇద్దరు ఆటగాళ్ళూ ఒక జంట కదలికలనే చేసినప్పుడు కానీ, 4) చదరంగపు బల్ల మీద కేవలం రెండు రాజులు మాత్రము ఉన్నపుడు
చెస్ ప్రారంభం
చదరంగ ఆట యొక్క ప్రారంగభం గురించి వివిధ దేశాలు మధ్య వివాదాలు కలవు. కాని ఈ ఆట భారత్ లోనే పుట్టిందని చాలామంది భావిస్తున్నారు చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. భారత దేశం లో నే ఈ ఆట ప్రాణం పోసుకుందని చరిత్ర చెబుతోంది. చదరంగాన్ని చతురంగ అని పిలిచేవారు. ఇక్కడి నుండి పెర్షియా కి వ్యాప్తించింది. పెర్షియా మిద దాడి చేసిన అరబ్స్, సౌతేర్న్ యూరోప్ కి ఈ ఆటని తీసుకెళ్ళారు. వర్తమాన కాలంలో వాడుకలో ఉన్న చదరంగం అట పరిణామక్రమంలో యూరోప్ లోని 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. నలుగురు ఆడే చదరంగం బోర్డు 18 శతాబ్దంలో కనిపెట్టారు.
19వ శతాబ్దం ద్వితియార్ధం లో ఆధునిక చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి(Modern chess tournament). మొట్టమొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 1886 లో నిర్వహించబడినది. 20వ శతాబ్దంలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ (World Chess Federation) ఏర్పడింది.
-------దన్యవాదములు-------
P.గౌతం సాయి.
P.Goutham Sai.
Comments